- నా పుట్టింటి నుంచే నా భర్తకు అవమానం జరిగితే నేనెలా ఊర్కుంట: కవిత
- అసలు తన భర్త ఫోన్ ట్యాప్ చేసిందెవరో బయట పెట్టాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అనిల్ ఫోన్‌ను ట్యాప్ చేశారని ఇప్పటికే ఆరోపించిన ఆమె.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ టార్గెట్‌గా కామెంట్స్చేశారు. తన భార్య ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ‘‘భార్య ఫోన్ ట్యాప్ అయితే..మా అన్న లైట్ తీసుకుంటారా? లేకపోతే బాధపడతారా? నాకు ఫస్ట్ హీరో మా నాన్న.
నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి నా భర్త. అలాంటి నా భర్తకు.. నా పుట్టింటి (నా తండ్రి కుటుంబం) నుంచే అవమానం జరుగుతుంటే నేనెలా ఊరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డా. కచ్చితంగా హర్ట్ అయిన. ఇదే నా అన్న భార్యకు జరిగితే వాళ్లు ఊరుకుంటారా? దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ నాకు సమాధానం చెప్పాలి. అసలు నా భర్త ఫోన్ ట్యాప్ చేసింది ఎవరో బయటకు రావాలి’’ అని అన్నారు.
