కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కవిత భేటీ!

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కవిత భేటీ!
  • చిన్న కొడుకుతో కలిసి ఎర్రవల్లి ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు..
  • ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండడంతో తాత ఆశీర్వాదం 
  • కొడుకును కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్తున్న కవిత..వచ్చే నెల 1న రాక

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ​ కవిత  శుక్రవారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. కవిత చిన్న కొడుకు ఆర్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండడంతో.. తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. కవిత కొడుకు ఆర్య తన తాత కేసీఆర్​ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కవిత ఫాంహౌస్​ నుంచి బయటకు వచ్చేశారు. కాగా, కుమారుడిని అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు కవిత శనివారం అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్​ 1న తిరిగి రానున్నారు. 

రాజీ లేదు.. చర్చే లేదు..

కవిత తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. అందుకు తగ్గట్టుగా కేటీఆర్​, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కేసీఆర్​ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు పిలిపించుకున్నారనే వార్తలు వచ్చాయి. కాగా, కవిత ఫాంహౌస్​ నుంచి వెళ్లేపోయే ముందు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఇక, కవిత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు పయనమై సగం దూరం వచ్చాక కేటీఆర్..​ హైదరాబాద్​ నుంచి బయల్దేరి ఫాంహౌస్​కు వెళ్లారని సమాచారం.

ఈ క్రమంలోనే  కేసీఆర్​, కవిత మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెళ్లిపోయాక కేటీఆర్​, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భేటీ అయిన కేసీఆర్​.. కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ రిపోర్టుపై చర్చించినట్టు తెలిసింది. కమిషన్​ రిపోర్టుపై అసెంబ్లీలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేసీఆర్​ దిశానిర్దేశం చేశారని సమాచారం. కమిషన్​ రిపోర్టులో కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావునే హైలైట్​ చేసిన నేపథ్యంలో.. న్యాయపరంగా సవాల్​ చేసే కోణాల్లోనూ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. అందులో భాగంగానే కమిషన్​ ఇచ్చిన ఫుల్​ రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఇటీవల సర్కారుకు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.