
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదించలేదని జాగృతి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజీనామా ఆమోదించాలని చైర్మన్‌ను కోరానని, వాళ్ల అధికారులతో సైతం మాట్లాడానన్నారు. చైర్మన్ అందుబాటులో లేరని వారు చెప్పారన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో ఆమె చిట్ చాట్ చేశారు.
“ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించిన ఆర్నెళ్లల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం సీటు ఖాళీగానే ఉంది. అవసరమైతే వెళ్లి చైర్మన్‌ను కలుస్తాను” అని కవిత వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాగృతి కార్యాలయంలో కవిత జాతీయ జెండా ఆవిష్కరించారు.