టార్గెట్ హరీశ్, సంతోష్ .. పన్నీరు వారి పాల దందా..హ్యాపీరావు ఘోరాలు..కవిత ట్వీట్లు వైరల్

టార్గెట్ హరీశ్, సంతోష్ .. పన్నీరు వారి పాల దందా..హ్యాపీరావు ఘోరాలు..కవిత  ట్వీట్లు వైరల్

ఇప్పటికే హరీశ్ రావు ,సంతోష్ రావులను టార్గెట్ చేసిన కవిత..ఇపుడు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.  కవితక్క అప్ డేట్స్  పేరుతో ఎక్స్ లో   పోస్టులు పెడుతోంది కవిత టీం.  టైం చెప్పి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది కవిత టీం.

 అక్రమాల టానిక్..పన్నీరు వారి పాల దందా ముచ్చట అంటూ ఎక్స్ లో స్టోరీ పోస్ట్ షేర్ చేశారు కవితక్క టీం. అన్నయ్య కలిపిన అనుబంధం టానిక్, దళితుల్ని ముంచిన పాలు అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.  నేరెళ్ల నేరాలు..హ్యాపీ రావు ఘోరాలంటూ సెటైర్లు వేశారు. కొంపలో కుంపటి పెట్టిన హ్యాపీ రావు అంటూ సంతోష్ రావును టార్గెట్ చేశారు కవిత. ఆమె పోస్టులు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

ఇటీవలే హరీశ్,సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత,బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసిన సంగతి తెలిసిందే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కవిత..ఇపుడు మరోసారి హరీశ్,సంతోష్ లను టార్గెట్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. 

అవినీతి అనకొండలు

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావు అవినీతి అనకొండలు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావుతోపాటు మేఘా కృష్ణారెడ్డి కారణమని ఆరోపించారు. వాళ్ల వల్లే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవినీతి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకొని వారు లబ్ధి పొందారని, వాళ్ల వల్లే కేసీఆర్ బద్నాం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘అయినా వాళ్లనే మోస్తాం.. వాళ్లకే ఇస్తాం’’ అంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుందని ప్రశ్నించారు. ఒక బిడ్డగా తనకు చాలా బాధగా ఉందని తెలిపారు.  ఐదేండ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు ఇందులో మేజర్ పాత్ర లేదా? అని అడిగారు. అందుకే రెండో టర్మ్ లో హరీశ్‌‌‌‌‌‌‌‌రావును మంత్రి పదవినుంచి కేసీఆర్ తప్పించారని కామెంట్ చేశారు కవిత.