కేబినెట్ కోసమే లలిత బదులు కవిత?

కేబినెట్ కోసమే లలిత బదులు కవిత?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎమ్మెల్సీ సీటు కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే మళ్లీ బెర్త్‌‌‌‌‌‌‌‌ కన్ఫమ్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆమె కోసం లలితను పక్కన పెట్టినట్లయింది.

నిజామాబాద్, వెలుగు: లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ సీటు హాట్ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది. గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమె పదవీ కాలం ఆరు నెలల కింద  ముగిసింది. అయితే ఎమ్మెల్యే కోటాలో ఆమె ఎమ్మెల్సీ రెన్యూవల్ కాలేదు. దీంతో లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారని అంతా భావించారు. కాని చివరి క్షణంలో అనూహ్య పరిణామాలతో ఎమ్మెల్సీ పదవి చేజారినట్లు తెలుస్తోంది.  

కవిత వైపే మొగ్గు..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత పదవీకాలం వచ్చే జనవరి 2న ముగుస్తుంది. కానీ అనుకున్న టైం కంటే ముందుగానే ఎలక్షన్స్‌‌‌‌ వచ్చాయి. కవితకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కట్టబెట్టి జిల్లాకు చెందిన సీనియర్ నేతకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని హైకమాండ్‌‌‌‌ భావించింది. అయితే ఎమ్మెల్యే కోటాలో ఈ ఇద్దరికి అవకాశం రాలేదు. ఎమ్మెల్యే కోటా  రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌కు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో సీఎం కూతురు కవితకు ఈసారి రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ప్రచారం జరిగింది.  ఆకుల లలిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకుంది. అనుకున్నట్లే ఆదివారం రాత్రి లలితకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖారారైనట్లు వార్తలొచ్చాయి. సోమవారం ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌లో  నిజామాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థిత్వంపై తర్జనభర్జలు జరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత వైపు మొగ్గుచూపారు. నేడు ఆమె నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేయనున్నారు.

పార్టీ మారినా..

2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లోనే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన ఆకుల లలిత టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి కొనసాగిస్తామనే హామీతోనే పార్టీ మారారని  అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆమెకు ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కలేదు. 

బరిలో విపక్షాలు వాకౌవర్?

జిల్లాలో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా ఇందులో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు 684 మంది, బీజేపీకి 86 మంది, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 54 మంది సభ్యులు ఉన్నారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 28 , బీజేపీ 57 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలకు కలిపి వంద ఓట్లు సాధించకపోవడంతో ఆ పార్టీల నేతలు పోటీపై నిరాసక్తి చూపుతున్నారు.  ఈ ఎన్నికల బరి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాకౌవర్ ఇస్తున్నాయి. ఇదే జరిగితే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కేబినేట్‌‌‌‌లోకి కవిత?

ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ అయిన తర్వాత మంత్రి వర్గంలో ఖాళీ ఏర్పడింది. అయితే మంత్రుల పనితీరు ఆధారంగా మార్పు చేర్పులు చేసి డిసెంబర్ రెండో వారంలోనే మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సిట్టింగ్​ ఎమ్మెల్సీ కవితను మంత్రి వర్గంలోకి తీసుకుని కీలక శాఖను అప్పగించనున్నారే ప్రచారం జరుగుతోంది.