ఓటీటీలో కాయదు లోహర్ హవా.. మూడు వారాల్లో మూడు సినిమాలు స్ట్రీమింగ్  

ఓటీటీలో కాయదు లోహర్ హవా.. మూడు వారాల్లో మూడు సినిమాలు స్ట్రీమింగ్  

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కయాదు లోహర్.  ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి.   ప్రస్తుతం ఆమె  ఓటీటీలోనూ  వరుస సినిమాలతో సందడి చేయబోతోంది. కయాదు  నటించిన మూడు సినిమాలు మూడు వారాల వ్యవధిలో డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం విశేషం. అక్టోబర్ 22న ‘ది ప్యారడైజ్’, అక్టోబర్ 30న ‘ఇమ్మోర్టల్’ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

 కయాదు లోహర్ నటించిన మలయాళ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ నవంబర్ 6 నుంచి జియో హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వరుసగా మూడు సినిమాలతో ఆమె  ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ఒక్కో వారం ఒక్కో సినిమా డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో కయాదు సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.  ఇక ఈ మూడు సినిమాలు విభిన్నమైన కథలు, నేపథ్యాలతో ప్రేక్షకుల ముందుకు రావడం  మరో విశేషం.

థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులతో పాటు ఓటీటీలో కొత్త చిత్రాలను ఎంజాయ్ చేసేవారికి కూడా కయాదు లోహర్ సినిమాలు వరుసగా అందుబాటులోకి రావడం తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవాలి.