మార్చి 17న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుంది: కేసీ వేణుగోపాల్

మార్చి 17న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుంది: కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై  ప్రస్తుతం గుజరాత్ కు చేరుకుంది. మరోవైపు భారత్ జోడో న్యాయ్ యాత్రపై  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. మార్చి 17 న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుందని ప్రకటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 17 న ముంబై చేరుకుంటుంది.. అదే రోజు ముగింపు సభ ఉంటుందన్నారు. ముగింపు సభకు హాజరు కావాలని విపక్ష కూటమి నేతలందరికీ లేఖ రాస్తున్నామన్నారు కేసీ వేణుగోపాల్. 

కాంగ్రెస్ పార్టీ రైతులకోసం పనిచేస్తుందన్నారు కేసీ వేణుగోపాల్ రెడ్డి. కిసాన్ న్యాయ్ పేరుతో కనీస మద్దతు ధరకు చట్టం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. సామాజిక , ఆర్థిక, కుల గణన కూడా  మా ఎన్నికల నినాదం అని వెల్లడించారు. యువ న్యాయ్ పేరుతో దేశ యువతకు న్యాయం చేసేందుకు 30 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు కేసీ వేణుగోపాల్. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మూదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 35 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు కేసీ వేణుగోపాల్. రైట్ టూ అప్రెంటిషిస్ షిప్ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. తద్వారా అప్రెంటిస్ లకు నెలకు రూ. 8,500 అందజేస్తామన్నారు. పేపర్ లీకేజీల కారణంగా దేశంలో జరుగుతున్న  పరీక్షలపై యువతకు నమ్మకం పోయింది.. లీకేజీలు లేకుండా పట్టిస్టంగా పరీక్షలనుు నిర్వహించడం లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. రూ. 5 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో 40 ఏళ్ల లోపు యువతకు స్టార్టప్ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సహకరించేందుకు హామీ ఇస్తుందన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.