కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు హైకోర్టులో షాక్..

కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు హైకోర్టులో షాక్..

 బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్ ​అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కన్నా రావు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో తనపై నమోదు అయినా కేసు కొట్టివేయాలని కన్నారావు హైకోర్టును ఆశ్రయించారు. కన్నారావు పిటిషన్ పై విచారణ జరిపించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కన్నారావు పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు వెల్లడించింది. 

అసలేం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ పేర్కొన్నారు.