Telangana politics : KCR బస్సు యాత్ర.. KTR పాదయాత్ర

Telangana politics : KCR బస్సు యాత్ర.. KTR పాదయాత్ర

బీఆర్ఎస్ పార్టీని బలోపేతం దిశగా కసరత్తు జరుగుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. పార్టీ తరపున డిజిటల్ యాప్ తీసుకొచ్చి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించారాయన. 2026, జూన్ 12వ తేదీన  హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. 

రాష్ట్రం మొత్తం కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారని.. అదే సమయంలో నేను పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు కేటీఆర్. ఈ రెండు ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదని.. తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారాయన. కేసీఆర్ బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో ఉంటుందని.. అదే సమయంలో నా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. కాంగ్రెస్ పాలనపై జనంలో వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని.. దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు కేటీఆర్. 

ALSO READ : రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు..

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం అని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారిపోతుందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జ్యోస్యం చెప్పారు కేటీఆర్.