బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?

బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?

లోక్ సభ వరంగల్ అభ్యర్ధి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. పార్టీ అధిష్టానం డైలమాలో పడింది. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా బాబు మోహన్ ను బరిలో దించాలని ప్రయత్నిస్తుంది. ఈ విషయమై స్వయంగా కేసీఆరే బాబూ మోహన్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన బాబూ మోహన్.. టికెట్ రాదన్న విషయం తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే కోపంలో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. 

ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్‌లో పోటీ చేయాలని భావించారు. అయితే, గురువారం(మార్చి 28) రాత్రి బీఆర్ఎస్‌లో జరిగిన అనూహ్య పరిణామల దృష్ట్యా బాబూ మోహన్‌కు కేసీఆర్ ఫోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేసులలో స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, వరంగల్ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు ఉన్నారు. పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ లతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.