పీవీ సింధుకు కేసీఆర్ అభినందనలు

పీవీ సింధుకు కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. వరసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.