జనవరి 20 నుంచి రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు : సత్యనారాయణగౌడ్

జనవరి 20 నుంచి రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు : సత్యనారాయణగౌడ్
  • కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ 

ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 20 నుంచి వీబీజీ రామ్​ జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో విడతలవారీగా నిరసనల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

 వచ్చే నెల 2న మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్​ సిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు  పాల్గొన్నారు.