ICMR-NIIRNCDలో ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

ICMR-NIIRNCDలో ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఐసీఎంఆర్ ఎన్ఐఐఆర్ఎన్​సీడీ) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్, బీడీఎస్, ఎంబీబీఎస్, డిడిప్లొమా, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్,  ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, ఎంపీహెచ్​ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. జనవరి 14 నుంచి 16 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఖాళీలు: 45.

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – III 19, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–II   08,  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-I 13, ప్రాజెక్ట్ నర్స్ – III  01, ప్రాజెక్ట్ సైంటిస్ట్ –బి (మెడికల్) 01, ఫీల్డ్ సూపర్​వైజర్ 02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 01.  

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జనవరి 14 నుంచి 16 వరకు.

పూర్తి వివరాలకు niirncd.icmr.org.in  వెబ్​సైట్​ను సందర్శించండి.