- సెమీస్‌కు చేరిన తెలంగాణ, యూపీ, హర్యానా టీమ్‌లు
- వర్షం కారణంగా వాయిదా పడ్డ రాజస్థాన్, కర్ణాటక మ్యాచ్
పినపాక, వెలుగు : భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్లో నిర్వహిస్తున్న 69వ అండర్-–17 ఎస్జీఎఫ్బాలుర కబడ్డీ పోటీలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. లీగ్ మ్యాచ్‌ల నుంచి 16 టీమ్‌లు ఇంటిబాట పట్టగా, మరో 16 టీమ్‌లు ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. ప్రీక్వార్టర్ ఫైనల్లో కేరళ టీమ్‌తో పోటీపడిన తెలంగాణ టీమ్తీవ్ర ఉత్కంఠ మధ్య 4 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.
విద్యాభారతిపై పంజాబ్ 1 పాయింట్, ఆంధ్రప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ 26 పాయింట్స్, గుజరాత్‌పై పుదుచ్ఛేరి 5 పాయింట్స్, మణిపూర్‌పై రాజస్థాన్ 18 పాయింట్స్, సీబీఎస్ఈపై కర్ణాటక 17 పాయింట్స్, హర్యానాపై మధ్యప్రదేశ్ 34 పాయింట్స్, మహారాష్ట్రపై తమిళనాడు 13 పాయింట్స్ ఆధిక్యంతో విజయం సాధించి క్వార్టర్ఫైనల్స్కు చేరాయి.
సాయంత్రం నిర్వహించిన నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌లో పుదుచ్ఛేరిపై ఉత్తరప్రదేశ్ 24 పాయింట్స్, తమిళనాడుపై హర్యానా 1 పాయింట్, పంజాబ్‌పై తెలంగాణ 22 పాయింట్లతో సెమీస్‌కు చేరాయి. రాజస్థాన్, కర్ణాటక టీమ్ మధ్య జరుగనున్న క్వార్టర్ఫైనల్మ్యాచ్ వర్షం కారణంగా రేపటికి వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రేపటి సెమీస్‌లో తెలంగాణ టీమ్ తో ఉత్తరప్రదేశ్టీమ్, హర్యానా టీమ్ తో రాజస్థాన్ లేదా కర్ణాటక టీమ్ తలపడనున్నాయి.
