
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానం సమీపంలో త్వరలోనే మహా సుదర్శన యాగం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వంద ఎకరాల యజ్ఞవాటికలో 1,048 యజ్ఞ కుండాలతో 3 వేల మంది రుత్విక్కులు, మరో 3 వేల మంది సహాయకులతో యాగం జరగనుంది. దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, బద్రీనాథ్, శ్రీరంగం, పూరీ జగన్నాథ్, తిరుమల క్షేత్రాల నుంచి మతాధిపతులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.
చినజీయర్‌తో సీఎం భేటీ
చినజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. శంషాబాద్ దగ్గర్లోని ముచ్చింతలలో ఉన్న స్వామి ఆశ్రమానికి మంగళవారం వెళ్లారు. యాగం ఏర్పాట్లతో పాటు రాజకీయాలపై చర్చించారు. సుమారు రెండు గంటలు మాట్లాడారు. సీఎం వెంట ఎంపీ సంతోష్‌కుమార్, మైహోం రామేశ్వర్‌రావు ఉన్నారు.