
దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. కేవలం భూమి లేని పాలేరులకు కేసీఆర్ భూమి ఇస్తామన్నారని చెప్పారు. భూముల రేట్లు పెరిగి భూములు దొరకడం లేదు కాబట్టి ఒక్కో కుటుంబానికి రూ.30 లక్షల సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరుదామన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు రాజయ్య.
మొన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు రాజయ్య. ఆ విషయం తెలిసి తాను అక్కడికి వెళ్లానన్నారు. హుజూర్ నగర్ లో దొతి కట్టుకొని ప్రచారం చేసింది తానేనన్నారు. మాదిగగా పుట్టినందుకు గర్వపడుతున్నానని అన్నారు. రిజర్వేషన్లు ఎవరికి లాభం చేస్తున్నాయని ఆలోచించాలన్నారు. ఏ బి సి వర్గీకరణ కావాలి అంటే కేంద్రంపైన పోరాటం చేయాల్సిందేనన్నారు.