ఈటలపై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తోంది

ఈటలపై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తోంది

ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. TRS ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో ఈటల గెలుస్తారని స్పష్టం చేశారు. జన ఆశీర్వాదయాత్ర లో భాగంగా హన్మకొండలో మాట్లాడారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం ఈటల రాజేందర్ పై కక్ష కట్టిందన్నారు. ఈటలపై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నారో, ఫామ్ హౌస్ లో ఉన్నారో తెలియడం లేదన్నారు కిషన్ రెడ్డి. వరంగల్ ఏయిర్ పోర్టు కోసం మేము కట్టుబడి ఉన్నాం.. కేసీఆర్ స్పందించాలన్నారు. కాకతీయుల కళా సంపద,ప్రాచీన కట్టడాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కేంద్ర పర్యటక మంత్రిగా కాకతీయ కళా సంపదను రక్షిస్తానని చెప్పారు. వేయిస్థంబాల కళ్యాణ మండపం నిర్మాణం ఏడేళ్లుగా పెండింగ్ లోనే ఉందని..ఆ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వెనక  ప్రధాని మోడీ  కృషి ఎంతో ఉందన్నారు. కాకతీయుల కళా సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశారన్నారు.

వరంగల్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. కరోనా కట్టడి కోసం మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. 27మంది బీసీలు, 19మంది దళితులు, 8మంది గిరిజన, 11మంది మహిళలు, ఐదుగురు మైనార్టీలకు మంత్రి వర్గంలో ప్రధాని అవకాశం కల్పించారన్నారు.