హాలియా: నల్గొండ జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. బుధవారం హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. సభ ప్రారంభంలో ముఖ్యమైన నాలుగు వరాలు ప్రకటించారు. ప్రస్తుత నల్గొండ జిల్లాలో 844 గ్రామాలున్నాయని.. ప్రతి గ్రామ పంచయతీకి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈలాగే నల్గొండ జిల్లాలోని మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున, నల్గొండ జిల్లా కేంద్రానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు, మిగతా ఒక్కో మున్సిపాలిటీకి రూ. కోటి కేటియిస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.
