ఆర్టీసీ నష్టాలకు కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణం

ఆర్టీసీ నష్టాలకు కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణం

RTCని నష్టాల్లోకి నెట్టి… ప్రైవేట్ పరం చేయాలనే కుట్రతో  కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వ విధానాల కారణంగానే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. నల్గొండజిల్లా మిర్యాలగూడలో మాట్లాడిన ఆయన …తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత IAS,IPS అధికారులను నియామకం చేయకుండా ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందన్నారు. నీతి, నిజాయితీకి మారు పేరుగా… అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సంస్థ RTC అన్నారు

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్టీసీ కార్మికులను సమ్మెకు పురికొల్పింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు జీవన్ రెడ్డి. ఆర్టీసీ నష్టాల్లో వుంది ప్రైవేట్ పరంచేస్తానంటున్నసీఎం కేసీఆర్… ప్రస్తుతం ప్రభుత్వం నష్టాల్లో ఉందని మరి ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేస్తారా అని ప్రశ్నించారు. లక్షా నలబై వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా…  ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు MLC జీవన్ రెడ్డి.