ఫాంహౌౌస్ కేసు : తీర్పు వెంటనే అమలుచేయొద్దని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి

ఫాంహౌౌస్ కేసు :  తీర్పు వెంటనే అమలుచేయొద్దని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి

ఫాం హౌస్ కేసు తీర్పుపై కేసీఆర్ సర్కారు అప్రమత్తమైంది. తీర్పును వెంటనే అమలు చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి తీర్పు ఫైనల్ కాపీ వచ్చే వరకు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా చూడాలని కోరింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ఫైనల్ కాపీ వచ్చే వరకు జడ్జిమెంట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. 

ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది. 

ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయాలని అభ్యర్థించింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న  న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది.