మున్సిపోల్స్‌కు రెడీ : ఆర్డినెన్స్ జారీ చేసిన కేసీఆర్ సర్కార్

మున్సిపోల్స్‌కు రెడీ :  ఆర్డినెన్స్ జారీ చేసిన కేసీఆర్ సర్కార్

మున్సిపల్ ఎన్నికల కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా 1965 మున్సిపల్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ మున్సిపల్ నిబంధనల చట్ట సవరణ 2019 ఆర్డినెన్స్ ను జారీ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు ఖరారు చేసింది ప్రభుత్వం. చట్ట సవరణకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది మున్సిపల్ శాఖ.

పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హై కోర్టు. దీంతో.. అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను ప్రకటించింది ప్రభుత్వం.

ఆర్డినెన్స్ తో ఏంటి లాభం..?

మున్సిపల్ చట్టానికి సవరణ చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ తో వార్డులు పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో 2631 వార్డులు …ఉండేవి. చట్ట సవరణ ఆర్డినెన్స్ తో ఈ వార్డుల సంఖ్య 3,385 కు పెరిగింది. మొత్తం 754 వార్డులు పెరిగాయి. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.