ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేసిండు: ఉత్తమ్

ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేసిండు: ఉత్తమ్

తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..   రెండు టీంఎంసీల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని ఆరోపించారు.  95 వేల కోట్లతో కాళేశ్వరం  కూలిపోయే ప్రమాదం ఉందని విమర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసిన ఎకరాకు నీళ్లియ్యలేదని ధ్వజమెత్తారు. 

రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్  కోసమే కేసీఆర్ హైలెవల్ మీటింగ్ కు హాజరుకాలేదని ఆరోపించారు ఉత్తమ్.   బోర్డు ప్రాజెక్టుల అప్పగింతపై  తమ ప్రమేయం లేదన్నారు.  బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించబోమన్నారు ఉత్తమ్.  జగన్ నీళ్లు ఎత్తుకు పోతుంటే  కేసీఆర్ ఏకాంత చర్చలో మునిగిపోయారని విమర్శించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు కేసీఆరే అన్యాయం చేశారని చెప్పారు. 

ఏపీ నీళ్ల దోపిడికి ముఖ్య కారకుడు కేసీఆరే

ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పదేళ్లలో కేసీఆర్ ఒక్క కిలోమీటరే తవ్వించారని చెప్పారు రేవంత్. కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు.  కేసీఆర్ తీరుతో తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారాయని ఆరోపించారు.పాలమూరు రంగారెడ్డికి రూ.,30 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్వివ్వలేదన్నారు.27 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 67 వే లకోట్లకు అంచనాలు పెంచారని ఆరోపించారు.