రెండేళ్ల నుండి అడుగుతున్నా కేసీఆర్ అపాయింట్ ఇవ్వలేదు 

రెండేళ్ల నుండి అడుగుతున్నా కేసీఆర్ అపాయింట్ ఇవ్వలేదు 
  • మంత్రి జగదీష్ రెడ్డికి చెప్తున్నా మూడు నెలలైనా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతాదా..?
  • హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు
  • కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ: ‘‘ఎంపీగా ఉన్న నాకు రెండేళ్లుగా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగుతున్నా.. ఇంత వరకు దిక్కేలేదు.. మంత్రి జగదీష్ రెడ్డికి చెప్తున్నా.. మూడు నెలల వ్యవధిలో సీఎం అపాయింట్ మెంట్ దొరుకుతాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే.. ఎంపీ గా నాకు కనీస సమాచారం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరు, సీఎం పక్కన కూర్చుంటే ఆయన ఆడే అబద్ధాలకు నా పరువు పోవడం ఖాయమని అన్నారు. 
మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతా
తెలంగాణకు నది అంటేనే మూసి.. అలాంటి నదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంటులో మాట్లాడతానని ఆయన తెలిపారు. దళితులకు క్యాబినెట్ లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కు తెలుసు అని ఆయన ఎద్దేవా చేశారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఒడిపోయినట్టు అని ఆయన పేర్కొన్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడీకి పాత నల్లగొండ జిల్లా బౌండరీలు తెలుసా..? అని ఆయన ప్రశ్నించారు. జిల్లా మంత్రికి చెప్తున్న 3 నెలలు గడువులో సీఎం అపాయింట్మెంట్ దొరుకుతాదా.. ఎంపీ స్థానంలో ఉండి 2 సంవత్సరాల నుండి అపాయిట్ మెంట్ అడిగితే.. ఇంతవరకు దిక్కేలేదు అని ఆయన పేర్కొన్నారు.