
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరులో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల భవనానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, రేవంత్ సర్కార్ వచ్చాక సంస్థ కోలుకుంటోందన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల భవన స్థలం విషయంలో ఎవరిదగ్గరైనా భూపత్రాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.. గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ చారి, కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి హరితా ధన్‌రాజ్‌గౌడ్, వేముల అమరేందర్ రెడ్డి, బొక్క వంశీధర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు.