హైదరాబాద్: జయేష్ రంజన్, నర్సింహ రెడ్డి, మంత్రి కేటీఆర్ కలిసి పారిశ్రామిక భూములపై కన్నేశారన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడిన ఆయన..7 ఏళ్ళుగా నర్సింహ రెడ్డి అక్కడే పాతుకొని ఉన్నాడన్నారు. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ మిత్రమండలికి చెందిన పరిశ్రమలకే రాయితీలు ఇస్తున్నారన్నారు. అశోక్ లేలాండ్స్, హైదరాబాద్ డిస్టీలరి, మోడెర్న్ బేకరీని కొన్నది కేటీఆర్ మిత్రమండలి కాదా అన్నారు. గవర్నర్ వెంటనే కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలన్న ఆయన..తహశీల్దార్ పై కేకే కూతురు ఎందుకు దాడి చేసిందో లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
దాడి వెనుక కుట్ర ఉందని.. మియాపూర్ ల్యాండ్ అంశంలో కేకే పాత్ర ఉందన్నారు. కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారు అంటే.. కేసీఆర్ అసమర్థుడు అయి ఉండాలి, అవినీతికి పాల్పడిన వ్యక్తి అయిన అయి ఉండాలన్నారు. దేశంలో చాలా ప్రాంతీయపార్టీలు కుటుంబ పార్టీలుగా మారి కనుమరుగయ్యాయని..టీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అవుతుందన్నారు. సంవత్సరం కాలం సీఎంగా కేటీఆర్ మిగిలిపోతారని.. అసమర్థ మంత్రి కేటీఆర్.. ఆయనకు ఉన్న ఏకైక అర్హత కేసీఆర్ కొడుకు కావడమే అన్నారు ప్రభాకర్.
