బీజేపీతో బీఆర్‌ఎస్ చేతులు కలిపింది : రేవంత్‌రెడ్డి

 బీజేపీతో బీఆర్‌ఎస్ చేతులు కలిపింది : రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ ను ఎదుర్కోలేక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేతులు కలపాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, కాంగ్రెస్ ను బలహీన పరిచడమే వారి ధ్యేయమని  అన్నారు. మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రధాని మోడీకి మార్గం సుగమం చేసేందుకే కేసీఆర్ బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ.. బీఆర్‌ఎస్, ఆప్, ఏఐఎంఐఎంల సాయం తీసుకుంటోందని రేవంత్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్‌ గుజరాత్‌, హిమాచల్‌, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని రేవంత్ ప్రశ్నించారు.