సొంత విమానం కొంటున్న మొట్టమొదటి సీఎం..కేసీఆరే

సొంత విమానం కొంటున్న మొట్టమొదటి సీఎం..కేసీఆరే

హైదరాబాద్, వెలుగు : దేశంలో సొంత విమానం కొంటున్న మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఖజానాలో పైసలు లేక రాష్ట్రం దివాలా తీసిందని, రుణమాఫీకి, నిరుద్యోగ భృతికి, ఫీజు రీయింబర్స్​మెంట్​ కు డబ్బులు లేవని అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో లేదన్నారు.

ఆరోగ్య శ్రీ, సోషల్​ వెల్ఫేర్ హాస్టళ్లు, యూనివర్సిటీలు, హాస్పిటళ్లు, హైదరాబాద్‌‌లో రోడ్లు, నాలాల అభివృద్ధికి డబ్బులు లేని సర్కారును ఏలుతున్న కేసీఆర్.. సొంత విమానం ఎలా కొంటున్నారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలకు వచ్చే ప్రతి పైసాకు లెక్క అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ట్వీట్ చేశారు.