పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

V6 Velugu Posted on Jun 16, 2021

తెలంగాణ వ్యాప్తంగా పేద ప్రజల కోసం లక్షల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని..పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పైసా ఖర్చు లేకుండానే పేదలకు తమ ప్రభుత్వం ఇళ్లను కట్టిస్తోందన్నారు. 

నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా.. చాలా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. నిరుపేదల ముఖాల్లో సంతోషాన్ని చూడటమే తమ లక్ష్యమన్నారు. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కట్టించి ఇవ్వడం లేదన్నారు. త్వరలోనే అర్హులందరికీ పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

Tagged KTR , poor people, KCR government goal, betterment

Latest Videos

Subscribe Now

More News