ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కల్వకుంట్ల తెలంగాణ

ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కల్వకుంట్ల తెలంగాణ
  • ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ ప్రాజెక్టులు బందీ
  • హైదరాబాద్ చుట్టు పక్కల భూములన్నీ కేసీఆర్ కుటుంబంలో చేతిలో బందీ
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

నిజామాబాద్: ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కేవలం కల్వకుంట్ల తెలంగాణ మాత్రమే.. అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనని ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం భారత రాజ్యాంగ పరిరక్షణపై బీజేపీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు.

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను బర్తరఫ్ చేశారని, అలాగే సీఎంవోలో ఒకే ఒక దళిత అధికారి ఉన్నారని తెలిపారు. కౌలు రైతులకు దళితు బంధు పథకం వర్తింపచేయమంటే ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కి దళిత ఓట్లు మాత్రమే కావాలి, వారి సంక్షేమం అవసరం లేదని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ దళితుడు కాబట్టే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటుండు.. మరింత అవినీతి చేయటానికి వీలుండేలా రాజ్యాంగాన్ని మార్చలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం అన్నారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు..ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ ప్రాజెక్టులు బందీలయ్యాయని, అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల భూములన్నీ కేసీఆర్ కుటుంబంలో చేతిలో బందీ అయ్యాయని అన్నారు. కమీషన్ల సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి  అన్నారు. ప్రజల డబ్బులతో రాజకీయం చేస్తున్న సీఎం కేసీఆర్ నాటకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.

 

 

 

ఇవి కూడా చదవండి:

యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని  చూస్తున్నరు

8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్