
నిజామాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్సోమవారం పార్లమెంట్ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్ రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రోడ్‌షో, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి రోడ్ షో ఉంటుందని నెహ్రూపార్క్, గాంధీ చౌరస్తా మధ్యలో కార్నర్‌మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంట్లో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం కామారెడ్డికి బస్సుయాత్ర వెళ్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ ఏరియా విజిట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తదితరులున్నారు.