
- హాజరైన కేటీఆర్, హరీశ్ రావు, పోచంపల్లి,
- శంభీపూర్ రాజు కూడా
- కవిత ఆరోపణలపైనే చర్చిస్తున్నారా?
- హాట్ టాపిక్ గా మారిన మీటింగ్
- కవితక్క అప్ డేట్స్ ఫ్యామిలీ లొల్లి పీక్స్
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షే త్రంలో ఈ భేటీ జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామా లు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిన కూడా పిలవడంతో కవిత ఆరోపణల మీదే చర్చిస్తున్నారనే అనే అనుమా నాలు కలుగుతున్నాయి. ఈ సమావేశంలో కేటీఆర్ ఉదయం నుంచి ఉండగా, లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు వరుసగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు కాస్త ఆలస్యంగా ఫా మహౌస్కు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా చర్చిం చినట్లుగా తెలుస్తోంది. సంతోష్ రావుతో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ అవినీతికి పా ల్పడ్డారని మోకిలా వద్ద రూ.750కోట్ల విల్లా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు.
►ALSO READ | కవితక్క అప్ డేట్స్.. ఫ్యామిలీ లొల్లి పీక్స్.. X లో ట్రెండ్ అవుతున్న పేజ్
ఈ క్రమంలో పోచంపల్లిని కూడా ఫామ్ హౌస్ కు పిలిపించడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వ రం అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలపై కూడా చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. కవిత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాంపైనా ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.