కవితక్క అప్ డేట్స్.. ఫ్యామిలీ లొల్లి పీక్స్.. X లో ట్రెండ్ అవుతున్న పేజ్

కవితక్క అప్ డేట్స్.. ఫ్యామిలీ లొల్లి పీక్స్.. X లో ట్రెండ్ అవుతున్న పేజ్
  • కవితక్క అప్ డేట్స్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్
  • హరీశ్ సీఎం కావాలంటూ మరో వీడియో

హైదరాబాద్: కవితక్క అప్డేట్స్ పేరుతోఓ ట్విట్టర్ పేజ్ ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలా జరిగిందంటూ కొన్ని విషయాలను ఆ పేజ్ లో పోస్ట్ చేస్తున్నారు. అగ్గిపెట్టె మచ్చ అనే పేరుతో పరోక్షంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కథనాలు వస్తున్నాయి. హంపిలో కమలాన్ని మొలకెత్తించాలి అనుకున్న కారు ఓనర్లు అంటూ ఓ పోస్టింగ్ పెట్టారు. 

'కేసీఆర్ తరువాత కేటీఆర్ ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లమేము. కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు.' అంటూ ఈ స్టోరీలో రాసుకొచ్చారు. 

►ALSO READ | హైదరాబాద్ చర్లపల్లిలో డ్రగ్స్ డెన్.. 12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

ఇదిలా ఉండగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. హరీశ్ రావు సీఎం కావాలంటూ ఓ అమ్మాయి చేసిన ఈ వీడియోను కవితక్క అప్ డేట్స్ లో పోస్టు చేసి అసలు కథ ఇదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ లొల్లి పీక్స్ కు చేరుకుందనేది హాట్ టాపిక్ గా మారింది.