
- ఊపర్ షెర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా కథ
- పేరుకు ‘వాగ్దేవి ల్యాబ్స్' చేసేది మాదక ద్రవ్యాల ఉత్పత్తి
- హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అతి భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను ఛేదించిన ముంబై పోలీసులు
- విదేశీయుడు సహా 12 మంది అరెస్ట్ నిందితుల్లో కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ కూడా..
పేరుకు లాబొరేటరీ.. లోపల తయారు చేస్తున్నది మాత్రం డ్రగ్స్. ఈ కర్మాగా రం ఎక్కడో కాదు.. మన చర్లపల్లిలోనే ఉంది. చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లోకెమికల్ ఫ్యాక్టరీ కేంద్రంగా, ఎండీ (మె ఫెడ్రోన్) అనే మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా నుంచి సుమారు రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నా రు. మహారాష్ట్రకు చెందిన మీరాభయందర్, వసాయివిరార్ (ఎంబీవీవీ) పోలీసులు కొన్నా ళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో తమ గూఢాచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం సేకరించారు. ఈనేపథ్యంలో స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. 'వాగ్దేవి ల్యాబ్స్' అనే నకిలీ లైసెన్స్ తోనడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యా ధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
►ALSO READ | సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చికిత్స