కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది

కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది

చరిత్ర ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా మెదక్ కలెక్టరెట్‌లో ఆయన జెండా ఎగురవేశారు. అంతకుముందు ఆయన చిన్నశంకరంపేటలోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బతకలేరని చెప్పిన వారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చూసి నివ్వెరపోతున్నారని మంత్రి తలసాని అన్నారు. కరోనా వ్యాధి ప్రభావం ఉన్నా కూడా.. రైతులు నష్టపోకూడదని రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేశామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు మణిహారంగా ఉంటుందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతులకు నీటి ఎద్దడి సమస్య తీరుతుందని ఆయన అన్నారు. మత్స్య కార్మికులకు సబ్సిడీ ద్వారా చేప పిల్లలను, గొర్రెల కాపారులకు 75% సబ్సిడీపై గొర్రెలను ఇచ్చి ఆదుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. తెలంగాణ సాంస్కృతిక పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంఎల్సీ శేరి సుభాష్ రెడ్డి ఈ వేడుకలలో పాల్గొన్నారు.

For More News..

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్

స్కూళ్లు తెరవొద్దని 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే మా తొలి లక్ష్యం