ములుగు, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ హౌస్ లో నవగ్రహ చండీయాగం చేయించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈ యాగం జరిగింది. 21 మంది వేద పండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, జీవన్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కవిత రాజకీయ జీవితం అనుకూలంగా లేకపోవడం వల్ల వేద పండితుల సూచనల మేరకు నవగ్రహ చండీయాగం నిర్వహించారని పార్టీ నేతలు తెలిపారు.