
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు ఆర్పించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని సీఎం కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.
దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడివున్నదని సీఎం అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తి తో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Chief Minister Sri K. Chandrashekar Rao paid rich tributes to former Prime Minister of India Sri #PVNarasimhaRao on his birth anniversary. pic.twitter.com/PYeoWZFa7V
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2022
తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నర్సింహారావు అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ దగ్గర ఆయన నివాళులు ఆర్పించారు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఢిల్లీ పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలను ఏర్పాటు చేసామన్నారు. పీవీ నర్సింహారావు చరిత్ర తెలిసేలా పుస్తకలు విడుదల చేస్తున్నామన్నారు. వీపీ తపాలా బిళ్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Offered floral tributes to the son of Telangana Soil, Polyglot, Statesman & Former Prime Minister of India Sri PV Narasimha Rao Garu, at PV Ghat on Necklace Road, Hyderabad.
— G Kishan Reddy (@kishanreddybjp) June 28, 2022
His pursuit to serve the nation & ability to be a lifelong learner will inspire generations. pic.twitter.com/AuaPm7LaSN
Humble Homage to
— Prof Dasoju Srravan (@sravandasoju) June 28, 2022
Father of Indian Economic Reforms, Former Prime Minister of India, Proud Son of Telangana, Shri PV Narasimha Rao on his Birth Anniversary.. pic.twitter.com/gHdX4AKmxI
Our homage to Former Prime Minister, P. V.garu on his birth anniversary. A Gandhi loyalist.
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 28, 2022
PV garu led the economic transformation of the country through liberalisation. He implemented Rajiv’s vision for 21 st century.
A Son of Telangana and leader of India ?? @INCTelangana pic.twitter.com/36SptgZrC0
My tributes to Former Prime Minister, P.V.Narasimha Rao garu on his birth anniversary.
— Revanth Reddy (@revanth_anumula) June 28, 2022
PV ushered the country into an era of economic reforms. pic.twitter.com/SLSWkBuFOi