కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయి

కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయి

సూర్యాపేట: కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. సూర్యాపేట జిల్లా బాలెంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆట చేతన ఫౌండేషన్ ఆధ్యర్యంలో బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. కానీ బీహార్ నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నారని, కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయి కాబట్టే బీహార్ అధికారులపై అతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అంటూ ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో డ్రామా నడుస్తోందన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నల్గొండ జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందుకే కేసీఆర్ పీకేను పిలిపించుకున్నారన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం:

భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ