సన్నాసులకు అర్ధం కాదు..తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమే

సన్నాసులకు అర్ధం కాదు..తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమే

బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీరిలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, హుజురాబాద్ నేత స్వర్గం రవి ఉన్నారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడి సీఎం కేసీఆర్ .. ప్రజాసంక్షేమంలో భాగస్వాములు కావడానికే పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహితుడని.. టీడీపీలో కలిసి పనిచేశామన్నారు.రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన తనకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చివర్లో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తాను కార్లకు రంగులు మార్చడంపై పలువురికి సందేహాలు వచ్చాయన్నారు. ఉమ్మడి ఏపీ సీఎం వాడిన నల్లకార్లను తనకు ఇచ్చారని.. కానీ తనకు నల్లరంగు నచ్చదన్నారు. అందుకే నల్ల కార్లకు తెల్లరంగులు వేయించామన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు మంచిగా అమలు చేస్తున్నామని.. పథకాలు అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో సహాయం అందిస్తామన్నారు. దేశ జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్‌డీపీ చాలా ఎక్కువన్నారు. తెలంగాణ ఎన్నటికీ ధనిక రాష్ట్రమేనన్న సీఎం కేసీఆర్..కొంత మంది సన్నాసులకు అర్ధం కావడం లేదన్నారు.

అంతేకాదు.. సమాజంలో ఆర్ధింకంగా వెనుకబడి ఉన్నవారికి కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న రాష్ట్ర తెలంగాణ అన్నారు. ఇందులో భాగంగానే..దళిత బంధు స్కీంను ప్రారంభించామన్నారు. దీన్ని కొన్ని పార్టీలు పడుతూ విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన జాతి దళిత జాతి అని..వీరి అభివృద్ధి కోసం చేపట్టిన స్కీం దళిత బంధు అన్నారు. దీని కోసం.. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. అంతేకాదు..వారికి ఇంటికో పది లక్షలు ఇస్తామని కూడా చెప్పామన్నారు. దళిత బంధు కరోనా కారణంగా ఆలస్యమైందని..ఇప్పుడు  హుజురాబాద్ లో ప్రారంభించామని తెలిపారు.

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం.. ప్రపంచ దేశాలకు అదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు సీఎం కేసీఆర్. ప్రతిపక్షాలు అడ్డుకున్నా.. అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏది ఎవరికి అవసరమే వారికి ఆ సహాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్న కేసీఆర్...దళిత బంధు స్కీం చాలా గొప్పదన్నారు.దానికి అందరూ సహకరించాలని కోరుతున్నానని తెలిపారు.