
మండేపల్లిలో 1360 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని.. త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లడిన ఆయన…. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందడానికి పైరవీలు ఉండవని… అందరి ముందే లాటరీ తీసి ఇళ్లను అందిస్తామని చెప్పారు కేటీఆర్. రెడీ అయిన ఇండ్లను చూడాలనుకుంటే.. బస్ ఏర్పాటు చేస్తానని… వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడండని అన్నారు… ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… 8 ఇందిరమ్మ ఇళ్లకు సమానమని చెప్పారు. పేదల పూర్తి సమగ్ర సమాచారం మా దగ్గర ఉందని.. వారిని వెతికి పట్టుకొని ఇళ్ళు ఇస్తామని తెలిపారు.
బీడీలు చుట్టే వారికి పింఛన్ ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు రాష్ట్రం ఏర్పడిన తరువాత 200 ఉన్న పింఛన్ ను కేసీఆర్ 1000 రూపాయలకు పెంచినట్లు గుర్తుచేశారు. ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు రూ. 3016, ఇతర ఫించన్లనూ రూ. 2016కు పెంచుతున్నామని అన్నారు. పింఛన్ వయస్సు 57 కు తగ్గించడంతో 7 నుంచి 8 లక్షల మందికి లబ్ది చేకూరనుందని అన్నారు కేటీఆర్. బీడీలు చుట్టే కార్మికులు లక్షన్నర మందికి నెలకు 2 వేలు రాబోతున్నాయని అన్నారు. పేదల ఇండ్లకు పట్టాలు ఇచ్చి వారికి లోన్ తీసుకునే సదుపాయం కల్పించామని చెప్పారు కేటీఆర్.
రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగం పేద విద్యార్థులకు ఖర్చు పెడుతున్నామని అన్నారు కేటీఆర్. 3 లక్షల మంది విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం చదువు చెప్పేస్తుందని అన్నారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రూ. 65 కోట్లు చెక్కులను త్వరలోనే అందజేస్తామని అన్నారు కేటీఆర్.