కేసీఆర్ విగ్రహం పెట్టిన టీఆర్ఎస్.. అడ్డుకున్న బీజేపీ

కేసీఆర్ విగ్రహం పెట్టిన టీఆర్ఎస్.. అడ్డుకున్న బీజేపీ

సీఎం కేసీఆర్ విగ్రహం సిద్ధిపేటలో రాత్రికి రాత్రే వెలసింది. దాంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణానికి చెందని టీఆర్ఎస్ కార్యకర్తలు.. లాల్ కమాన్‎పై అర్దరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహం ఏర్పాటుచేశారు. విషయం తెలిసి.. బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకున్నారు. విగ్రహాన్ని తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని అడ్డుకొని.. కేసీఆర్ విగ్రహాన్ని అక్కడినుంచి తీసుకెళ్లారు.