సెర్ప్ ఉద్యోగులకు కేసిఆర్ అండగా నిలిచాడు.. జీవితాన్ని ఇచ్చాడు

సెర్ప్ ఉద్యోగులకు కేసిఆర్ అండగా నిలిచాడు.. జీవితాన్ని ఇచ్చాడు

సెర్ప్ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పనిచేశారని, రాష్ట్ర సాధనలో సెర్ప్ ఉద్యోగుల కృషి కూడా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పటి ప్రభుత్వాలు సెర్ప్ పై ఉక్కు పాదం మోపితే.. కేసీఆర్ సర్కారు వాళ్లను ఆదుకుందని, జీవితాన్ని ఇచ్చిందని తెలిపాడు. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్ మూడో సారి సీఎం అవ్వడానికి తమ వంతు కృషి చేయాలని హారీష్ రావు సెర్ప్ ఉద్యోగులను కోరారు. పల్లె ప్రజలకు చైతన్య పరుస్తూ బీఆర్ఎస్ సర్కారుకు ఓటు వేసేలా కదిలించాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రపై కక్ష కట్టి నిధుల కోత విధించిందని హరీష్ రావు  మండిపడ్డారు. నీతి అయోగ్ కూడా అభివృద్ధికోసం ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వంత ఖర్చులతోనే మెడికల్ కాలేజీలు కట్టిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ స్కారు తలొగ్గకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుందని హరీష్ రావు తెలిపారు. 

రాయిని కరిగించే శక్తి సెర్ప్ కు మాత్రమే ఉంది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పని తీరును వివరించి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నిధుల గురించి సెర్న్ ప్రజలకు తెలియజేయాలని ఉద్యోగులను హరీష్ రావు కోరారు.