‘కేసీఆర్‌‌ పట్టు దలతోనే 24 గంటల కరెంట్‌‌’

‘కేసీఆర్‌‌ పట్టు దలతోనే 24 గంటల కరెంట్‌‌’

 

సూర్యాపేట, వెలుగు: విద్యుత్‌ రంగంపై కేసీఆర్‌ కు ఉన్న పట్టుదల, అనుభవమే ఆ రంగంలోరాష్ట్రం సాధిం చిన విజయానికి కారణమని మంత్రి జి. జగదీశ్‌ రె డ్డి తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య ఆధ్వర్యం లో
సూర్యా పేట జిల్లా కేంద్రం లో సోమవారం మంత్రిని సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పడం
రాష్ట్ర అభివృద్ధికి, కేసీఆర్‌ విజన్‌‌కు నిదర్శనం అన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా వెనుక సీఎం మార్గదర్శకత్వం తో పాటు విద్యుత్‌ ఉద్యోగుల శ్రమ ఉందన్నా రు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఏడు గంటల విద్యుత్‌ ,
సంవత్సరం తిరిగే సరికి తొమ్మిది గంటలు, మూడేళ్లలోనే 24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత మాదేనన్నారు. గతంలో టార్ట్‌‌లైట్‌
వెలుగులో ఆపరేషన్లు చేసిన సందర్భా లున్నాయని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిం దని వైద్యుడు రాంమూర్తి యాదవ్ తెలిపారు.