- రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడమంటే..తెలంగాణ ప్రజలను అవమానించడమేనని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం జరిగే బడ్జెట్చర్చలోనైనా కేసీఆర్ పాల్గొని ప్రజల తరఫున తన గొంతు వినిపించాలని కోరారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేటీఆర్, హరీశ్ ఫామ్ హౌస్లో నిర్భందించారేమోనని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఃసీఎం వ్యాఖ్యలు తప్పే అయితే.. కేటీఆర్, హరీశ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే కేసీఆర్ సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని డిమాండ్ చేశారు.
