యశోద ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

యశోద ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిన సిఎం కేసీఆర్ పరామర్శించారు. కడుపులో గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. మరికాసేపట్లో ఆయనను ఐసీయూలోకి మార్చనున్నారు. సర్జరీ ముగిసిన తర్వాత కేసీఆర్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేగుకు గాయం కావడంతో ఇన్ ఫెక్షన్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వైద్యులు కేసీఆర్ కు తెలిపారు. అనంతరం కేసీఆర్,  ప్రభాకర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. 

దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న  కొత్త ప్రభాకర్ రెడ్డి  సోమవారం సిద్ధిపేట జిల్ల దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని అనుచరులు చికిత్స నిమిత్తం హుటాహుటినా సికింద్రాబాద్ యశోద దవాఖానాకు తరలించారు.