మంచిరెడ్డి పద్మమ్మ ‘దశదిన కర్మ’కు సీఎం కేసీఆర్

మంచిరెడ్డి పద్మమ్మ ‘దశదిన కర్మ’కు సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మే 28న ఎమ్మెల్యే సొంత గ్రామమైన ఎలిమినేడుకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. మంచిరెడ్డి పద్మమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్.. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి పద్మమ్మ మే 18వ తేదీన అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. 

మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  తీగల కృష్ణారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.