ఆపరేషన్ తర్వాత .. వాకర్ సాయంతో కేసీఆర్ ను నడిపించిన డాక్టర్లు

ఆపరేషన్ తర్వాత .. వాకర్ సాయంతో కేసీఆర్ ను నడిపించిన డాక్టర్లు

బీఆర్ఎస్ చీఫ్,  మాజీ సీఎం కేసీఆర్ కాలుకి హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ పూర్తయింది. దీంతో డిసెంబర్ 9న  ఉదయం కేసీఆర్ తో  డాక్టర్లు  నడిపించడం ప్రాక్టీస్ చేయించారు.  ఇద్దరు డాక్టర్లు  కేసీఆర్ ను పట్టుకోగా వాకర్ సాయంతో  కేసీఆర్ మెల్లగా నడిచారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 డిసెంబర్ 7న రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారి పడ్డారు. ఎడమ కాలి తుంటి విరగడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 8న రాత్రి డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందనిప్రకటించారు డాక్టర్లు.

 

కేసీఆర్ కోలుకోవడానికి ఎనిమిది వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు.  సీనియర్ ఆర్థో పెడిక్, సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, ఇతర వైద్య బృందం కేసీఆర్ ఎడమ తుంటికి ఆపరేషన్ చేసి హిప్ రిప్లేస్ మెంట్ చేసినట్లు  హెల్త్  బులిటెన్ లో రిలీజ్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.