ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్తో కేసీఆర్కు మతిభ్రమించింది

ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్తో కేసీఆర్కు మతిభ్రమించింది

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్  పోల్స్ చూసి కేసీఆర్ కు మతిభ్రమించిందని, అందుకే బీజేపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో బిజేపీ గెలవబోతుందని తెలవడంతో ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. కాషాయ జెండాను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. మజ్లీస్ పార్టీని సంకలేసుకొని బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఆరోపిస్తావా అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. హిందూ సమాజాన్ని చీల్చాలని ప్రయత్నిస్తే మూసీలో కలుపతానంటూ హెచ్చరించారు. బంగారు తెలంగాణ అయిపోయింది ఇక బంగారు భారత్ చేస్తావా అంటూ ఎద్దేవా చేశారు.

రేపు పొద్దున 10గంటలకు టీవీలు చూడాలని చెప్తూ నిరుద్యోగులను మోసం చేయడానికి కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మిలియన్ మార్చ్ భయంతోనే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నారని బండి సంజయ్‌ అన్నారు. నోటిఫికేషన్ల పేరుతో ఉద్యోగులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం లక్షా 91వేల ఖాళీలున్నాయని, వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారందరికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి

నిరుద్యోగులు టీవీ చూడండి.. రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్త