OTTకి వచ్చేస్తున్న కీడా కోలా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTTకి వచ్చేస్తున్న కీడా కోలా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. అవుట్ అండ్ అవుట్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చైతన్య రావు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రత్యేకమైన పాత్రలో నటించారు. నవంబర్ 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. 

ఇదిలా ఉంటే.. కీడా కోలా రిలీజై 40 రోజులు గడుస్తున్నా నేపధ్యంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమా డిజిటిల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కీడా కోలా సినిమాను డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఆహా టీమ్. దీనికి సంబందించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మరి థియేటర్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.