జై సిద్ధార్థ్ హీరోగా యశ్‌విన్ దర్శకత్వంలో గీతా రమేష్, అక్షర జి ఆర్, సంతోష్ అబ్రహం నిర్మిస్తున్న చిత్రం ‘ఖైగల్’. ఉగాది సందర్భంగా గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు హీరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఓ యోధుడిలా కనిపిస్తున్న జై సిద్ధార్థ్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఇందులో తను దేవ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. సుష్మిత సింగ్, వాంశీ ఉదయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రియేష్ మోతుకూరి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో సహా 13 భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశారు.
