
‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కీర్తి సురేశ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాను క్యాష్ చేసుకుని కోట్లు వెనకేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవల కీర్తి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మహానటి తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపింది. ‘ఆ సినిమా హిట్‌తో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ, అవన్నీ ఫీమేల్ సెంట్రిక్ రోల్స్. దీంతో ఒక్కటీ ఒప్పుకోలేదు.
ఆరునెళ్ల పాటు నా చేతిలో డబ్బుల్లేవు. చాలా ఇబ్బంది పడ్డా. ఆ క్రమంలో ఖర్చుల కోసం కొన్ని సినిమాలు చేశాను. అవి తీవ్రంగా నిరాశపరిచాయి’ అని తెలిపింది. ఆ టైంలో కీర్తి పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవని సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. ఇక ఈ కథంతా విని.. ఆ సినిమా తర్వాత కీర్తి ఇన్ని కష్టాలు పడిందా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.